మరో నెగటివ్ పాత్రలో వరలక్ష్మి!
- తమిళంలో బిజీగా వరలక్ష్మి శరత్ కుమార్
- రవితేజ సినిమాలో కీలక పాత్ర
- విభిన్నంగా డిజైన్ చేసిన గోపీచంద్
ఈ నేపథ్యంలోనే రవితేజతో గోపీచంద్ మలినేని రూపొందిస్తున్న సినిమాలో నెగెటివ్ షేడ్స్ తో కూడిన ఒక కీలకమైన పాత్ర కోసం వరలక్ష్మిని తీసుకున్నారు. ఆమెకి సంబంధించిన పోర్షన్ ను చిత్రీకరిస్తున్నారు. దర్శకుడు ఆమె పాత్రను చాలా కొత్తగా డిజైన్ చేశాడట. ఆమె పాత్రలోని వైవిధ్యం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. ఈ సినిమా తరువాత ఈ తరహా పాత్రలతో ఆమె తెలుగులోను బిజీ కావడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.