Corona Virus: విమానం దిగడానికి గంట ముందు పారాసిటమాల్ వేసుకుని తప్పించుకుంటున్నారట!

  • దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తి
  • థర్మల్ స్క్రీనింగ్ లో పట్టుబడని వైనం
  • ఇంటికెళ్లగానే జ్వరం
  • టాబ్లెట్ వేసుకుని విమానం దిగినట్టు గుర్తింపు
Passenger from Dubai skip Thermal Screening with Paracetmol

విదేశాల నుంచి విమానాల్లో వస్తున్న వారు ఎయిర్ పోర్టులో జరుపుతున్న థర్మల్ స్క్రీనింగ్ కు దొరక్కుండా ఉండేందుకు కొత్త ప్లాన్ వేస్తున్నారు. విమానం ల్యాండింగ్ సమయానికి గంట ముందు పారాసిటమాల్ టాబ్లెట్ ను వేసుకుంటున్నారట. తమలో జ్వర లక్షణాలు కనిపిస్తే, గాంధీ ఆసుపత్రికో, క్వారంటైన్ కేంద్రానికో వెళ్లాల్సి వస్తుంద్న భయంతో, వీరు ఈ పని చేస్తున్నారు. దీంతో వారి శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతోంది. విమానం దిగిన తరువాత, జ్వరం లేకుంటే, వారిని 'సీ' కేటగిరీ కింద భావించి, హోమ్ ఐసోలేషన్ ను వైద్యులు సూచిస్తున్నారు.

ఇక విదేశీ ప్రయాణికులు చేస్తున్న ఈ పనిని గమనించిన తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ, కేంద్రానికి విషయాన్ని చేరవేసింది. రెండు రోజుల క్రితం దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి, ఇదే పని చేసి, ఇంటికి వెళ్లిపోయాడు. ఇతనికి థర్మల్ స్క్రీనింగ్ చేసినా జ్వర లక్షణాలు తెలియరాలేదు. అందుకు టాబ్లెట్ వేసుకోవడమే కారణమని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తి, జ్వరం, జలుబుతో బాధపడుతున్నాడని ఓ వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్ తో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

More Telugu News