mimi chakraborty: లండన్ నుంచి వచ్చిన సినీ నటి, ఎంపీ మిమి చక్రవర్తి.. 14 రోజుల స్వీయ నిర్బంధం!

  • సినిమా షూటింగు కోసం లండన్‌ వెళ్లిన నటి
  • నిన్న కోల్‌కతా చేరుకున్న వెంటనే స్వీయ గృహ నిర్బంధం
  • కేంద్రం సూచనల మేరకు నిర్ణయం
Bengali actress and MP Mimi Chakraborty in self quarantine for 7 days

పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రముఖ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మిమి చక్రవర్తి 7 రోజుల స్వీయ నిర్బంధం విధించుకున్నారు. ‘బాజీ’ సినిమా చిత్రీకరణ కోసం చిత్రబృందంతో కలిసి లండన్ వెళ్లొచ్చిన ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం కోల్‌కతా చేరుకున్న ఆమె కరోనా లక్షణాలు లేకపోయినా, ముందు జాగ్రత్త చర్యగా 7 రోజులపాటు తనకు తాను గృహ నిర్బంధం విధించుకున్నారు. ఈ వారం రోజులు ఆమె ఎవరినీ కలుసుకోరు.

 ఈ విషయాన్ని ఆ పార్టీ ప్రెస్ సెక్రటరీ అనీర్బన్ భట్టాచార్య తెలిపారు. కాగా, కరోనా బాధిత దేశాల నుంచి వచ్చేవారు స్వచ్ఛందంగా 14 రోజులు గృహ నిర్బంధంలో ఉండాలన్న కేంద్రం సూచనల మేరకు మిమి చక్రవర్తి ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాలను ప్రజలు తప్పకుండా పాటించాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు. తాను లండన్ నుంచి దుబాయ్ మీదుగా కోల్‌కతా చేరుకున్నట్టు చెప్పిన ఆమె.. అన్ని రకాల నివారణ చర్యలను తీసుకున్నట్టు తెలిపారు. తనను కలవొద్దని తల్లిదండ్రులకు కూడా చెప్పినట్టు పేర్కొన్నారు. తన తండ్రి వయసు 65 ఏళ్లని పేర్కొన్న మిమి.. ఏడు రోజులపాటు ఇంట్లోనే ఉంటానని వెల్లడించారు.

More Telugu News