Kidari sarveshwara rao: కిడారి, సోమ హత్యల కేసు.. లొంగిపోయిన కీలక నిందితుడు!

Maoist Samba Khara involved in killing of AP MLA surrenders in Malkangiri
  • సెప్టెంబరు 2018లో కిడారి, సివేరి సోమ హత్య
  • మల్కనగిరి ఎస్పీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు నేత సాంబ ఖరా
  • మరో ఏడుగురు మావోలు కూడా లొంగుబాటు
విశాఖపట్టణం జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సెప్టెంబరు 2018లో గ్రామ దర్శిని కార్యక్రమంలో పాల్గొని వస్తున్న వీరిద్దరిని లివిటిపుట్టు వద్ద అడ్డగించిన మావోయిస్టులు దారుణంగా హతమార్చారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మావోయిస్టు నేత సాంబ ఖరా అలియాస్ రణ‌దేవ్ నిన్న మల్కనగిరి ఎస్పీ ఎదుట లొంగిపోయాడు. ఏవోబీ మిలటరీ ప్లాటూన్ సభ్యుడైన రణదేవ్ మరో 12 కేసుల్లోనూ ప్రధాన నిందితుడని ఎస్పీ కార్యాలయం తెలిపింది. రణదేవ్‌తోపాటు మరో ఏడుగురు మావోలు కూడా లొంగిపోయినట్టు పేర్కొంది. కాగా, రణదేవ్‌పై గతంలో ఒడిశా ప్రభుత్వం రూ. 2 లక్షల రివార్డు కూడా ప్రకటించింది.
Kidari sarveshwara rao
Siveri Soma
Maoist
Malkangiri
Araku

More Telugu News