Bhadrachalam: కరోనా ఎఫెక్ట్​.. భద్రాద్రిలో శ్రీరామనవమి ఉత్సవాలకు బ్రేక్​!

Srirama Navami celebrations cancelled
షార్ట్స్‌లో చూడండి
శ్రీరామ నవమి ఉత్సవాలపైనా ‘కరోనా’ ప్రభావం పడింది. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో నిర్వహించాల్సిన శ్రీరామనవమి ఉత్సవాలకు బ్రేక్ పడింది. భద్రాద్రిలో చలువ పందిళ్ల ఏర్పాట్లను నిలిపివేశారు. ఎటువంటి ఆర్భాటం లేకుండా భద్రాద్రిలో సీతారాముల కల్యాణం నిర్వహించాలని దేవస్థానం నిర్ణయించినట్టు సమాచారం. భక్తులు కూడా తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని సూచించారు. కాగా, వచ్చే నెల 2వ తేదీన శ్రీరామ నవమి. ఈ ఏడాది ఆలయ అర్చకుల ఆధ్వర్యంలోనే సీతారాముల కల్యాణం జరుగుతుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నిన్న ప్రకటించారు.
Go Back to Shorts
Bhadrachalam
Sriramanavami
celebrations
cancel
Corona Virus

More Telugu News