Sensex: కుప్పకూలిన ప్రైవేట్ సెక్టార్ బ్యాంకుల షేర్లు.. మార్కెట్లలో మరో భారీ పతనం!

  • 1,709 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 498 పాయింట్లు పతనమైన నిఫ్టీ
  • 23.90 శాతం నష్టపోయిన ఇండస్ ఇండ్ బ్యాంక్
Sensex looses 1740 points

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా భారీ నష్టాల్లో ముగిశాయి. కరోనా వైరస్ భయాలతో ఇన్వెస్టర్లు అయినకాడికి అమ్ముకోవడానికే మొగ్గు చూపారు. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,709 పాయింట్లు పతనమై 28,869కి పడిపోయింది. నిఫ్టీ 498 పాయింట్లు కోల్పోయి 8,468కి దిగజారింది. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 1,966 పాయింట్ల వరకు పతనమైంది. అన్ని సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. ముఖ్యంగా టెలికాం, ఫైనాన్షియల్, బ్యాంకింగ్ షేర్లు తీవ్రంగా నష్టపోయాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ లో కేవలం ఓఎన్జీసీ, ఐటీసీ మాత్రమే లాభపడ్డాయి. ఓఎన్జీసీ ఏకంగా 9.83 శాతం పెరిగింది. టాప్ లూజర్లలో ఇండస్ ఇండ్ బ్యాంక్ (23.90%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (11.29%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (11.23%), బజాజ్ ఫైనాన్స్ (11.11%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (9.92%) ఉన్నాయి.

More Telugu News