Telangana: తెలంగాణ పదో తరగతి పరీక్షల్లో నిమిషం నిబంధన ఎత్తివేత!

  • 2,530 పరీక్షా కేంద్రాల ఏర్పాటు
  • హాజరు కానున్న 5.34 లక్షల మంది
  • అన్ని ఏర్పాట్లూ చేశామన్న ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్
No One Minute Rule in 10 exams in Telangana

తెలంగాణలో గురువారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానుండగా, అత్యంత కీలకమైన ఒక నిమిషం నిబంధనను తొలగిస్తున్నట్టు ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, నిమిషం నిబంధనను ఎత్తివేసినా, విద్యార్థులు కనీసం అరగంట ముందే పరీక్షా కేంద్రానికి వస్తే మంచిదని అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 2,530 కేంద్రాల్లో 5.34 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరు కానున్నారని ఆయన అన్నారు. విద్యార్థులకు మంచినీటి సౌకర్యంతో పాటు లిక్విడ్ హ్యాండ్ వాష్ లను అన్ని పరీక్షా కేంద్రాల వద్ద సిద్ధంగా ఉంచామని,  మాస్ కాపీయింగ్‌ కు పాల్పడకుండా ఫ్లైయింగ్, సిట్టింగ్ స్క్వాడ్‌ లను సిద్ధం చేశామని తెలిపారు.

More Telugu News