Madhya Pradesh Governor: మీ బాధ ఏమిటో అర్థం చేసుకున్నా: మధ్యప్రదేశ్ స్పీకర్ పై గవర్నర్ అసహనం

Can Understand Your Pain says Madhya Pradesh Governor To Speaker
  • ఆరుగురు ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించడం గొప్ప విషయం
  • మీ సమర్థతను, పారదర్శకతను అభినందిస్తున్నా
  • మిగిలిన ఎమ్మెల్యేల రాజీనామాల తిరస్కరణపై డైలమాలో ఉన్నా
మధ్యప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం పతనం అంచున ఉన్న సంగతి తెలిసిందే. జ్యోతిరాదిత్య సింధియాతో పాటు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించారు. వీటిలో ఆరుగురి రాజీనామాలను స్పీకర్ ఆమోదించారు. ఈ నేపథ్యంలో స్పీకర్ ఎన్పీ ప్రజాపతికి గవర్నర్ లాల్జి టాండన్ లేఖ రాశారు.

ఇళ్లకు దూరంగా వేరే ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేల గురించి మీరు చెందుతున్న ఆందోళనను తాను అర్థం చేసుకున్నానని లేఖలో గవర్నర్ పేర్కొన్నారు. గత 8-10 రోజులుగా మీరు ఎంత ఆవేదన చెందుతున్నారనే విషయాన్ని అర్థం చేసుకోగలనని చెప్పారు. ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించే నేపథ్యంలో, మీ సమర్థతను, పారదర్శకతను తాను అభినందిస్తున్నానని అన్నారు. మిగిలిన ఎమ్మెల్యేల రాజీనామాలను తిరస్కరించడంపై కొంచెం డైలమాలో ఉన్నానని చెప్పారు.
Madhya Pradesh Governor
Lalji Tandon
Assembly Speaker
NP Prajapati

More Telugu News