కరోనా ఎఫెక్ట్: చార్మినార్, గోల్కొండ కోట మూసివేత
- చారిత్రక స్థలాలపై కరోనా ప్రభావం
- వరంగల్ కోట కూడా మూసివేత
- భక్తులు లేకుండా రాములోరి కల్యాణం
ఇక ఈ సంవత్సరం శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా భద్రాచలంలో స్వామివారి కల్యాణం అర్చకులకు మాత్రమే పరిమితం కానుంది. ఏటా భక్తుల జయజయధ్వానాల మధ్య వేడుకగా జరిగే కల్యాణం, ఆలయ చరిత్రలో తొలిసారిగా అత్యంత నిరాడంబరంగా, పూజారులు, ప్రభుత్వ ప్రతినిధుల సమక్షంలోనే జరుగుతుంది. ఇక ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించే ఉగాది వేడుకలనూ నియంత్రించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రగతి భవన్ లో జరిగే ఉగాది కార్యక్రమాలకు సందర్శకులను అనుమతించరాదని భావిస్తున్నారు.