Nirbhaya: ఈ నెల 20న ఉరికి సన్నాహాలు... విడాకులు కోరిన నిర్భయ దోషి భార్య!

Nirbhaya convict Akshay Kumar wife files divorce petition
  • విడాకులు కోరుతూ అక్షయ్ కుమార్ సింగ్ భార్య పిటిషన్
  • ఓ దోషి భార్యగా ఉండదలుచుకోలేదని వెల్లడి
  • ఈ పిటిషన్ పై సందేహాలు వ్యక్తం చేస్తున్న న్యాయనిపుణులు
నిర్భయ దోషులకు మరణశిక్షలు పడినా ఇప్పటికీ అమలు కాలేదు. వ్యూహ, ప్రతివ్యూహాలతో నిర్భయ దోషులు ఉరిని ఆలస్యం చేస్తున్నారు. తాజాగా ఈ నెల 20న నిర్భయ దోషుల ఉరికి ఢిల్లీ కోర్టు వారెంట్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. నిర్భయ దోషుల్లో ఒకడైన అక్షయ్ కుమార్ సింగ్ భార్య పునీత విడాకులు కావాలంటూ సంచలనం సృష్టించింది.

తన భర్త నిర్దోషి అని, కానీ అతడిని దోషిగా తేల్చి ఉరిశిక్ష విధించారని, అత్యాచారం కేసులో ఉరితీతకు గురైన వ్యక్తికి భార్యగా ఉండదలుచుకోలేదని చెబుతూ ఔరంగాబాద్ ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసింది. న్యాయనిపుణులు ఈ విడాకుల పిటిషన్ పై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో పునీత భర్త అక్షయ్ కుమార్ సింగ్ కు కోర్టు నోటీసులు పంపాల్సి ఉంటుందని, ఈ కేసులో తీర్పు వచ్చేసరికి మరింత ఆలస్యం అవుతుందని అభిప్రాయపడుతున్నారు.
Nirbhaya
Akshay Kumar Singh
Wife
Punitha
Divorce

More Telugu News