Fake-sanitizers: హైదరాబాద్​ లో నకిలీ శానిటైజర్స్​ తయారీ ముఠా గుట్టు రట్టు!

  • రాచకొండ పరిధిలో నకిలీ శానిటైజర్స్ తయారీ
  • చర్లపల్లి, ఎల్బీనగర్, హయత్ నగర్, వనస్థలి పురంలో కంపెనీలు
  • దాడి చేసిన ఎస్ఓటీ పోలీసులు.. ముఠా అరెస్టు
హైదరాబాద్ లో నకిలీ శానిటైజర్స్ తయారు చేస్తున్న కంపెనీల గుట్టు రట్టయింది. రాచకొండ పరిధిలో ఈ దందా వెలుగు చూసింది. చర్లపల్లి, ఎల్బీనగర్, హయత్ నగర్, వనస్థలిపురంలో ఎస్ ఓటీ పోలీసులు దాడులు చేశారు. నకిలీ శానిటైజర్స్ తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఆయా చోట్ల నుంచి పెద్ద మొత్తంలో నకిలీ శానిటైజర్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

కాగా, కరోనా వైరస్ సోకకుండా ప్రధానంగా పాటించాల్సిన జాగ్రత్తల్లో చేతులను సబ్బుతో లేదా శానిటైజర్స్ తో కడుక్కోవాలని వైద్యులు చెబుతున్న విషయం తెలిసిందే. దీంతో, శానిటైజర్స్ ను కొనుగోలు చేసే వారి సంఖ్య పెరిగిపోయింది. దీనిని ‘క్యాష్’ చేసుకోవాలని భావించిన ఈ ముఠా నకిలీ శానిటైజర్స్ ను తయారు చేసినట్టు సమాచారం.
Fake-sanitizers
charlapalli
LB Nagar
Hayath Nagar
vanastalipuram

More Telugu News