Komatireddy Venkat Reddy: మోదీకి నాలుగు విజ్ఞాపన పత్రాలు అందించిన ఎంపీ కోమటిరెడ్డి

  • ఢిల్లీలో ప్రధానితో భేటీ అయిన భువనగిరి ఎంపీ
  • హైదరాబాద్ ఫార్మాసిటీకి పర్యావరణ అనుమతులు నిలిపివేయాలని విజ్ఞప్తి
  • మూసీ శుద్ధి కోసం రూ.3 వేల కోట్లు కేటాయించాలని వినతి
Congress MP Komatireddy met PM Modi

కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. నాలుగు అంశాలపై ఆయన ప్రధానికి విజ్ఞాపన పత్రాలు అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, హైదరాబాద్ లో ఏర్పాటు చేయతలపెట్టిన ఫార్మాసిటీకి పర్యావరణ అనుమతులు నిలిపివేయాలని, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి కొత్తగూడెం వరకు జాతీయ రహదారిగా చేయాలని, మూసీ నది ప్రక్షాళన కోసం రూ.3000 కోట్లు కేటాయించాలని, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలని ప్రధానిని కోరినట్టు కోమటిరెడ్డి తెలిపారు.

More Telugu News