prabhas: కరోనాను కూడా లెక్కచేయకుండా షూటింగ్ పూర్తి చేసిన ప్రభాస్

Prabhas dares corona and finish his shoot in Georgia
  • జార్జియాలో ప్రభాస్ సినిమా చిత్రీకరణ
  • ప్రభాస్ పై చేజింగ్ సీన్
  • వర్షం, చలి, మరోవైపు కరోనా ముప్పు నేపథ్యంలో చిత్రబృందం సాహసం
కరోనా మహమ్మారి చైనాను దాటి అనేక దేశాల్లో కరాళ నృత్యం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్ సాహసం చేశాడనే చెప్పుకోవాలి. చల్లటి వాతావరణానికి పెట్టిందిపేరైన యూరప్ దేశం జార్జియాలో తన కొత్త చిత్రం షూటింగ్ లో పాల్గొన్నాడు. యూరప్ ఖండంలో ఓవైపు ఇటలీ, స్పెయిన్ దేశాలు కరోనా వైరస్ ధాటికి అతలాకుతలం అవుతుండగా, ప్రభాస్ అండ్ టీమ్ ఎంతో మొండిధైర్యంతో జార్జియాలో షూటింగ్ పూర్తి చేసింది.

దీనిపై దర్శకుడు రాధాకృష్ణ స్పందించారు. జార్జియాలో ప్రభాస్ పై ఓ చేజింగ్ సీన్ చిత్రీకరించామని, కేవలం 10 డిగ్రీల ఉష్ణోగ్రత... ఎముకలు కొరికే చలి ఓవైపు, కరోనా ముప్పు మరోవైపు... ఇవేమీ తమ చిత్రబృందం ఉత్సాహాన్ని అడ్డుకోలేకపోయాయి అంటూ స్పందించారు. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజ హెగ్డే కథానాయికగా నటిస్తోంది.
prabhas
Gerogia
Corona Virus

More Telugu News