IYR Krishna Rao: నాడు బాబు చేసిన హంగామాకు, నేడు జగన్ చేస్తున్న దానికి పెద్దగా తేడా లేదు: ఐవైఆర్

IYR Krishna Rao says there no difference between Chandrababu and Jagan
  • స్థానిక ఎన్నికల నేపథ్యంలో బాబు, జగన్ మధ్య మాటల యుద్ధం
  • చంద్రబాబు కావాలనే ఎన్నికలను అడ్డుకున్నారని జగన్ ఆరోపణ
  • జగన్ ది రాజకీయ స్వార్థం అంటూ చంద్రబాబు మండిపాటు
  • ఇద్దరూ ఇద్దరేనంటూ ఐవైఆర్ ట్వీట్
తనకున్న పరిచయాలతో స్థానిక ఎన్నికలు వాయిదా వేయించారంటూ చంద్రబాబుపై సీఎం జగన్ ధ్వజమెత్తగా, ప్రపంచమంతా కరోనాను హడలెత్తి పోతుండగా, జగన్ మాత్రం తన రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని అటు చంద్రబాబు మండిపడుతున్నారు. ఈ వ్యాఖ్యలపై మాజీ ఐఏఎస్ అధికారి, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. నాడు సాధారణ ఎన్నికల సమయంలో చంద్రబాబు ఎన్నికల అధికారి కార్యాలయానికి వెళ్లి చేసిన హంగామాకు, ఇవాళ జగన్ రాష్ట్ర ఎన్నికల సంఘంపై చేస్తున్న హంగామాకు పెద్దగా తేడా ఏమీలేదని అభిప్రాయపడ్డారు. అంతేకాదు, జగన్, చంద్రబాబు పరస్పరం వ్యాఖ్యలు చేసుకున్న వీడియోను కూడా టిట్టర్ లో పోస్టు చేశారు.
IYR Krishna Rao
Chandrababu
Jagan
Local Body Polls
Andhra Pradesh
Corona Virus

More Telugu News