Yanamala: ఈ సారి కేంద్ర బలగాల బందోబస్తుతో ఎన్నికలు జరపాలి: యనమల

  • ప్రతిపక్ష పార్టీలను అణచివేయాలనే జగన్‌ ధోరణి మంచిది కాదు 
  • కరోనా విజృంభణపై జగన్ మాట్లాడుతున్న తీరు సరికాదు 
  • ఎన్నికల ప్రక్రియపై బీజేపీ కూడా డిమాండ్ చేస్తోంది
yanamala criticizes jagan decisions

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జరిగిన దాడులపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. ఎన్నికలు వాయిదా పడినందున ఈ సారి కేంద్ర బలగాల బందోబస్తుతో ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు.

మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రతిపక్ష పార్టీలను అణచివేయాలనే జగన్‌ ధోరణి మంచిది కాదని చెప్పారు. ఎన్నికల ప్రక్రియ మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాలని బీజేపీ కూడా డిమాండ్ చేస్తోందని, కేంద్ర బలగాలను రాష్ట్రానికి పంపాల్సిన బాధ్యత కేంద్రంపై కూడా ఉందని అన్నారు.

కరోనా వైరస్‌ విజృంభణపై సీఎం జగన్ మాట్లాడుతున్న తీరు సరికాదని యనమల అన్నారు. రాజ్యాంగ పరమైన వ్యవస్థను అవమానించేలా ఆయన మాట్లాడారని చెప్పారు. జగన్‌ స్పందనకు అనుకూలంగానే ఎన్నికల సంఘానికి సీఎస్‌ లేఖ రాశారని, ఎన్నికల ప్రక్రియ అంతా ఈసీ పరిధిలోనే ఉంటుందని చెప్పారు.

More Telugu News