Mohan Babu: అందుకే ఈ 'కరోనా' గాలికంటే వేగంగా వ్యాపిస్తోంది: మోహన్‌ బాబు

mohan babu about corona panic
  • పంచభూతాలు ఇచ్చిన వరాలను మనమే శాపాలుగా మార్చుకుంటున్నాం
  • ప్రకృతిని మనమే నాశనం చేసుకుంటున్నాం
  • ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాం
  • నా పుట్టిన రోజున ఎవరూ అభినందనలు తెలపడానికి రావద్దు
కరోనా వ్యాప్తిపై సినీనటుడు మోహన్‌బాబు ఆందోళన వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. 'పంచభూతాలు మనకు ఇచ్చిన వరాలను మనమే శాపాలుగా మార్చుకుంటున్నాం. ప్రకృతిని మనమే నాశనం చేసుకుంటున్నాం. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాం.. అందుకే ఈ కరోనా వ్యాధి ఒక దేశము నుంచి మరో దేశానికి గాలి కంటే వేగంగా ప్రయాణిస్తోంది' అని తెలిపారు.

'ప్రజలు గుంపులు గుంపులుగా ఉన్నప్పుడు ఒకరి నుంచి మరొకరికి వ్యాధి సోకే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఈ ఏడాది మార్చి 19న జరగాల్సిన శ్రీ విద్యా నికేతన్ పాఠశాల, కళాశాలల వార్షికోత్సవాన్ని, అదే రోజున జరుపుకుంటున్న నా పుట్టిన రోజు వేడుకలను వాయిదా వేస్తున్నాను' అని తెలిపారు. తనకు అభినందనలు తెలియజేయడానికి రావద్దని అందరికీ సూచించారు. అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

                                             
Mohan Babu
Tollywood
Corona Virus

More Telugu News