Corona Virus: ఇండియాలో కరోనా కల్లోలం.. తొలి రోగికి చికిత్స చేసిన డాక్టర్ కు కరోనా పాజిటివ్!

Doctor who treated fist corona death patient in India tested positive
  • ఇండియాలో విస్తరిస్తున్న కరోనా మహమ్మారి
  • కరోనా కారణంగా చనిపోయిన తొలి వ్యక్తికి చికిత్స చేసిన 63 ఏళ్ల డాక్టర్
  • పాజిటివ్ అని తేలడంతో ఐసొలేషన్ కు తరలింపు
అందరూ భయపడుతున్నట్టే మన దేశంలో కరోనా మహమ్మారి నెమ్మదిగా వ్యాపిస్తోంది. మన దేశంలో కరోనా సోకిన తొలి వ్యక్తికి చికిత్స చేసిన డాక్టర్ కూడా ఆ మహమ్మారి బారిన పడ్డారు. కర్ణాటక కలబుర్గీకి చెందిన 76 ఏళ్ల వ్యక్తి సౌదీ అరేబియా నుంచి తిరిగి వచ్చారు. కరోనా కారణంగా ఆయన మృతి చెందారు. ఇండియాలో కరోనా కారణంగా చనిపోయిన తొలి వ్యక్తి ఈయనే. ఈయనకు చికిత్స చేసిన కలబుర్గీకి చెందిన 63 ఏళ్ల డాక్టర్ కు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో, ఆయనను కుటుంబసభ్యులు ఏకాంతంగా ఒక గదిలో ఉంచారు. అనంతరం ఆయనను ఐసొలేషన్ వార్డుకు తరలించారు. ఈ విషయాన్ని కలబుర్గీ డిప్యూటీ కమిషనర్ శరత్ వెల్లడించారు.
Corona Virus
Doctor
Positive
Karnataka

More Telugu News