Munna: తెలివైనవాళ్లం కావడం తేలికే .. మంచివాళ్లం కావడమే కష్టం: దర్శకుడు మున్నా

30 Rojullo Preminchadam Ela Movie
  • ప్రదీప్ అంటే నాకు ఎంతో అభిమానం
  • ఆయనతో సినిమా చేయడం అదృష్టం  
  • తను పెద్ద స్టార్ అవుతాడన్న మున్నా     
తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి మరో ప్రేమకథ సిద్ధమవుతోంది. '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' అనే టైటిల్ తో ముస్తాబైన ఈ సినిమా, త్వరలో విడుదల కానుంది. ప్రదీప్ హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమాను గురించి దర్శకుడు మున్నా మాట్లాడాడు.

"ఈ సినిమాతో ప్రదీప్ తో నాకు మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. మా ఆలోచనలు .. అభిప్రాయాలు .. అభిరుచులు ఒకేలా ఉంటాయి. ప్రదీప్ మాచిరాజు కాదు .. ప్రదీప్ మంచిరాజు అని నాకు అనిపిస్తూ ఉంటుంది. పది పుస్తకాలు చదివేసి తెలివైనవాళ్లం కావడం తేలికే, కానీ మంచివాళ్లం కావడం కష్టం. అలాంటి మంచి లక్షణాలను నేను ప్రదీప్ లో చూశాను. అలాంటి ప్రదీప్ తో సినిమా చేసినందుకు నాకు చాలా సంతోషంగా అనిపిస్తోంది. భవిష్యత్తులో ప్రదీప్ పెద్ద స్టార్ అవుతాడనే నమ్మకం వుంది" అని చెప్పుకొచ్చాడు.
Munna
Pradeep
30 Rojullo Preminchadam Ela Movie

More Telugu News