KA Palu: టీఎస్, ఏపీ ప్రభుత్వాలు మా చారిటీ సిటీస్ లను వాడుకోవచ్చు: కేఏ పాల్ ఆఫర్

  • హైదరాబాద్, విశాఖలో చారిటీ సిటీస్ ఉన్నాయి
  • మొత్తం 400 పడకల సామర్థ్యం ఉంది
  • రూపాయి కూడా అద్దె వద్దన్న కేఏ పాల్
KA Paul Offer to Telugu States governments

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో, తనకు చెందిన రెండు చారిటీ సిటీస్ లను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు బాధితుల చికిత్స నిమిత్తం వాడుకోవచ్చని క్రైస్తవ మత బోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆఫర్ ఇచ్చారు.

తనకు సంగారెడ్డిలో 300 పడకల సామర్థ్యమున్న చారిటీ సిటీ, విశాఖలో 100 పడకల గదులు ఉన్న చారిటీ సిటీ లున్నాయని తెలిపిన ఆయన, వాటిని వాడుకుంటే, తనకు ఒక్క రూపాయి కూడా అద్దె చెల్లించనక్కర లేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించిన ఆయన, దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కృషి చేయాలని కోరారు. 

More Telugu News