Fish: చేపల వల్ల కరోనా రాదు.. ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ స్పష్టీకరణ

  • చేపలు, రొయ్యల వల్ల కరోనా వ్యాప్తి చెందదన్న మత్స్యశాఖ
  • నిరభ్యంతరంగా తినొచ్చన్న ఆ శాఖ కమిషనర్ సోమశేఖరం
  • ఆ వార్తల్లో శాస్త్రీయత లేదని స్పష్టీకరణ
AP fisheries Announces statement over Coronavirus

కరోనా భయంతో మాంసాహారానికి దూరంగా ఉంటున్నవారికి ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ శుభవార్త చెప్పింది. చేపలు, రొయ్యలు, ఇతర మత్స్య ఉత్పత్తులను ఆనందంగా తీసుకోవచ్చని, వీటివల్ల కరోనా వైరస్ వ్యాపించదని స్పష్టం చేసింది. వీటి వినియోగం వల్ల వైరస్ వ్యాపించదని ఆ శాఖ కమిషనర్ జి.సోమశేఖరం తెలిపారు. ఇదే విషయాన్ని భారత ఆహార పరిరక్షణ, ప్రమాణాల సంస్థ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలు కూడా తెలిపాయన్నారు. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల వైరస్ వ్యాపిస్తుందన్న వార్తల్లో శాస్త్రీయత లేదని, కాబట్టి అందరూ తినొచ్చని పేర్కొన్నారు.

కాగా, మాంసాహారం తినడం వల్ల కరోనా వైరస్ వస్తుందంటూ సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం అవుతున్న నేపథ్యంలో చికెన్ అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. దీంతో కిలో చికెన్ ధర కొన్ని ప్రాంతాల్లో రూ.20- రూ.40 మధ్యకు పడిపోయింది. చికెన్ తినడం వల్ల కరోనా వైరస్ రాదని అటు ప్రభుత్వం, ఇటు పౌల్ట్రీ వ్యాపారులు ప్రకటనలు ఇస్తున్నా ప్రజల్లో భయం మాత్రం పోవడం లేదు.

More Telugu News