Spanish football coach: కరోనాతో మృతి చెందిన స్పానిష్ ఫుట్‌బాల్ కోచ్

Spanish football coach Francisco Garcia becomes youngest Coronavirus victim
  • లుకేమియాతో బాధపడుతున్న గార్సియా
  • కరోనాతో మృతి చెందిన అతి పిన్న వయస్కుడు
  • రెండు వారాలు వాయిదా పడిన లీగ్
కరోనా వైరస్ బారినపడి 21 ఏళ్ల స్పానిష్ ఫుట్‌బాల్ కోచ్ ఫ్రాన్సిస్కో గార్సియా ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని అథ్లెటికో పోర్టాడా ఆల్టా క్లబ్ వెల్లడించింది. ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. అలాగే, కరోనా వైరస్ మరింత వ్యాపించకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంది. అందులో భాగంగా స్పానిష్ ఫుట్ ‌బాల్ లీగ్‌ను రెండువారాలపాటు వాయిదా వేసింది.

 కాగా, మృతి చెందిన ప్రాన్సిస్కో ఇప్పటికే లుకేమియాతో బాధపడుతున్నాడు. అతడికి కరోనా వైరస్ సోకడంతో పరిస్థితి మరింత విషమించింది. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కరోనా కారణంగా మలాగా పట్టణంలో మృతి చెందిన అతి పిన్న వయస్కుడు గార్సియానే.
Spanish football coach
Coronavirus
Francisco Garcia

More Telugu News