Maharashtra: నాగ్‌పూర్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. 144 సెక్షన్ విధింపు

  • మహారాష్ట్రలో 39 మంది కరోనా బాధితులు
  • ర్యాలీలు, నిరసన ప్రదర్శనలకు అనుమతి నిరాకరణ
  • ప్రజలు సహకరించాలన్న సీఎం ఉద్ధవ్ థాకరే
Section 144 of CrPC imposed in Nagpur to check Covid spread

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు పలు రకాల చర్యలు తీసుకుంటున్నాయి. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో కరోనా అనుమానిత కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒక్క ముంబైలోనే 14 మందికి ఈ మహమ్మారి సోకగా, రాష్ట్రవ్యాప్తంగా 39 మంది ఈ వైరస్ బారినపడ్డారు. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన నాగపూర్ మరో అడుగు ముందుకు వేసింది. 144 సెక్షన్ విధించింది. పోలీస్ జాయింట్ కమిషనర్ రవీంద్ర కందం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ర్యాలీలు, నిరసన ప్రదర్శనలకు అనుమతి లేదన్నారు.

కాగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ.. ఏ పట్టణాన్ని పూర్తిగా నిర్బంధించే ఉంచే ఉద్దేశం తమకు లేదన్నారు. అయితే, ప్రతి ఒక్కరు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దేవాలయాలు, మసీదులు,  చర్చిలకు గుంపుగా వెళ్లొద్దన్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టే విషయంలో వచ్చే 20 రోజులు ఎంతో కీలకమని, ఈ విషయంలో ప్రజలు సహకరించాలని కోరారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంక్షలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తామన్నారు.

More Telugu News