కరోనా అనుమానిత మహిళ మృతితో కాకినాడలో కలకలం

16-03-2020 Mon 18:21
  • ఇటీవలే దుబాయ్ నుంచి వచ్చిన మహిళ
  • జలుబు, జ్వరంతో ఆసుపత్రిలో చేరిక
  • కరోనా లక్షణాలుగా అనుమానించి ఐసోలేషన్ వార్డులో చికిత్స
Corona suspect woman dies in Kakinada
కాకినాడలో కరోనా లక్షణాలతో ఓ మహిళ మృతి చెందడం కలకలం రేపుతోంది. అంతర్వేదిపాలెంకు చెందిన ఆ మహిళ ఇటీవలే దుబాయ్ నుంచి రాష్ట్రానికి తిరిగొచ్చింది. జలుబు, జ్వరంతో బాధపడుతుండడంతో ఆమెను కుటుంబసభ్యులు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. కరోనా అనుమానంతో ఆ మహిళను ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆమె పరిస్థితి విషమించడంతో ఇవాళ ప్రాణాలు విడిచింది. కరోనా వైద్యపరీక్షల నివేదిక ఇంకా రావాల్సి ఉంది. ఆ మహిళ ల్యాబ్ రిపోర్టులు వస్తే మృతి కారణం కరోనానా కాదా అన్నది తెలుస్తుందని ఆసుపత్రి వర్గాలంటున్నాయి.