Varla Ramaiah: విజయసాయిరెడ్డిని జ్యుడీషియల్ కస్టడీకి తీసుకోవాలి: వర్ల రామయ్య

Vijaya Sai Reddy should be sent to custody demands Varla Ramaiah
  • రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని విజయసాయి భయపెడుతున్నారు
  • బెయిల్ రద్దు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపించాలి
  • బెయిల్ పై ఉన్న జగన్ రాజ్యాంగ వ్యవస్థలను భయపెడుతున్నారు
రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేశ్ ను వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి భయపెడుతున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. విజయసాయిపై ఉన్న బెయిల్ ను కోర్టు రద్దు చేయాలని కోరారు. జ్యుడీషియల్ కస్టడీకి పంపించాలని డిమాండ్ చేశారు. షరతులతో కూడిన బెయిల్ పై బయట ఉన్న ముఖ్యమంత్రి జగన్ రాజ్యాంగ వ్యవస్థలనే భయపెడతారా? అని ప్రశ్నించారు. ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల సంఘాలదే తుది నిర్ణయం అని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా మర్చిపోతే ఎలాగని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని ఎన్నికల ప్రధానాధికారి సంప్రదించాల్సిన అవసరం లేదని చెప్పారు.
Varla Ramaiah
Telugudesam
Jagan
Vijay Sai Reddy
YSRCP
State Election Commissioner

More Telugu News