Dhan Raj: ఇంట్లో నుంచి పారిపోయి ఇండస్ట్రీకి వచ్చాను: కమెడియన్ ధన్ రాజ్

Dhan Raj
  • నాకు సినిమాల పిచ్చి ఎక్కువ 
  • పదో తరగతి పరీక్షలు రాయలేదు 
  • తన తల్లి తనని అర్థం చేసుకుందన్న ధన్ రాజ్
తెలుగు తెరపై కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో ధన్ రాజ్ ఒకరుగా కనిపిస్తాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తనకి సంబంధించిన విషయాలను పంచుకున్నాడు. "మా నాన్నగారిది తాడేపల్లి గూడెం .. మా అమ్మగారిది హనుమాన్ జంక్షన్. నేను పుట్టింది తాడేపల్లిగూడెంలోనే.

మా నాన్న లారీ డ్రైవర్ గా పనిచేసేవాడు. నాకు నాలుగేళ్ల వయసున్నప్పుడు ఓ యాక్సిడెంట్ లో ఆయన చనిపోయాడు. నేను పదోతరగతి పరీక్షలు పూర్తిగా రాయకుండా, సినిమాల పట్ల గల పిచ్చితో పారిపోయి ఇండస్ట్రీకి వచ్చాను. ఆ తరువాత నన్ను వెతుక్కుంటూ మా అమ్మ ఇక్కడికి వచ్చింది. నా ఇష్టం ఏమిటో తెలుసుకుని దానిని నెరవేర్చడం కోసం తను కష్టపడింది. అలా ఎన్నో కష్టాలుపడుతూ ఈ రోజున నేను ఈ స్థాయిలో వున్నాను" అని చెప్పుకొచ్చాడు.
Dhan Raj
Comedian
Tollywood

More Telugu News