CAA: సీఏఏ వ్యతిరేక తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

 Resolution against CAA passed in the Telangana Assembly
  • పౌరసత్వ సవరణ చట్టం తీసుకువచ్చిన కేంద్రం
  • మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న తెలంగాణ ప్రభుత్వం
  • తెలంగాణ అసెంబ్లీలో సీఏఏపై చర్చ
  • కేంద్రం దీనిపై పునరాలోచన చేయాలన్న సీఎం కేసీఆర్
కేంద్రం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను వ్యతిరేకిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం లభించింది. సీఏఏపై మొదటి నుంచి వ్యతిరేక గళం వినిపిస్తున్న కేసీఆర్ సర్కారు చట్టసభలో దీనిపై పంతం నెగ్గించుకుంది. సీఏఏ వ్యతిరేక తీర్మానం సందర్భంగా జరిగిన చర్చలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, సరైన పత్రాలు లేని ప్రజలు కోట్లలో ఉన్నారని, ఇకనైనా కేంద్రం సీఏఏపై పునరాలోచన చేయాలని హితవు పలికారు.
CAA
Telangana
Resolution
KCR
TRS

More Telugu News