Kethika Sharma: సుకుమార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన కేతిక శర్మ

Sukumar Movie
  • బన్నీ సినిమాతో బిజీగా సుకుమార్ 
  •  నిర్మాతగా నాగశౌర్యతో సినిమా 
  • 'రొమాంటిక్' తరువాత కేతిక చేసే సినిమా ఇదే
ఒక వైపున దర్శకుడిగా .. మరో వైపున నిర్మాతగా సుకుమార్ కొత్త ప్రయోగాలు చేస్తూ వెళుతున్నాడు. దర్శకుడిగా బన్నీ సినిమాను పట్టాలెక్కించిన ఆయన, త్వరలో నిర్మాతగా మరో సినిమాను సెట్స్ పైకి తీసుకెళుతున్నాడు. నాగశౌర్య కథానాయకుడిగా కాశీ విశాల్ దర్శకత్వంలో ఆయన ఒక సినిమా చేస్తున్నాడు.

విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో కథానాయికగా ఎవరైతే బాగుంటారా అనే విషయంలో కొన్ని రోజులుగా తర్జన భర్జనలు పడ్డారు. చివరికి కేతిక శర్మను కథానాయికగా ఎంపిక చేశారనేది తాజా సమాచారం. పూరి జగన్నాథ్ నిర్మాణంలో రూపొందుతున్న 'రొమాంటిక్' సినిమా ద్వారా కేతిక శర్మ పరిచయమవుతోంది. ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాకమునుపే, ఆమె సుకుమార్ సినిమాలో ఛాన్స్ కొట్టేయడం విశేషం.
Kethika Sharma
Nagashaurya
Sukuma Movie

More Telugu News