Local Body Polls: ఏపీ స్థానిక ఎన్నికలపై సుప్రీం, హైకోర్టుల్లో పిటిషన్లు

AP government files pition in apex court on localbody pols
  • ఎపెక్స్‌ కోర్టును ఆశ్రయించిన జగన్‌ ప్రభుత్వం
  • రేపటి లిస్టులో చేర్చాలని ఆదేశించిన న్యాయమూర్తి
  • హైకోర్టులో ప్రైవేటు వ్యక్తులు లంచ్‌మోషన్‌ పిటిషన్‌
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని జగన్‌ ప్రభుత్వం సుప్రీం కోర్టులో చాలెంజ్‌ చేసింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకే వాయిదా వేస్తున్నట్లు చేసిన ప్రకటనను ఆక్షేపిస్తూ ఈరోజు పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ లలిత్‌ రేపటి రెగ్యులర్‌ లిస్టులో ఈ కేసును ఉంచాలని ఆదేశించారు. మరోవైపు ఏపీ హైకోర్టులో తాండవ యోగేష్‌, జనార్దన్‌ అనే ఇద్దరు వ్యక్తులు లంచ్‌మోషన్‌లో ప్రైవేటు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను ధర్మాసనం అనుమతించడంతో మధ్యాహ్నం విచారణకు రానుంది.
Local Body Polls
jagan government
Supreme Court

More Telugu News