Corona Virus: కడపలో యువకుడికి కరోనా లక్షణాలు

coronavirus cases kadapa
  • ఆసుపత్రిలో చేరిన యువకుడు
  • పది రోజుల క్రితం కువైట్‌ నుంచి రాక 
  • చికిత్స అందిస్తోన్న వైద్యులు
ఏపీలోని కడప జిల్లాను కరోనా భయపెడుతోంది. కడప రిమ్స్‌లో ఇప్పటికే రెండు కరోనా అనుమానిత కేసులు నమోదయిన విషయం తెలిసిందే. అదే జిల్లాలో మరొకరు కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు. ఓ యువకుడికి కరోనా వైరస్‌ అనుమానిత లక్షణాలు ఉన్నాయని గుర్తించిన వైద్యులు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

పది రోజుల క్రితం అతడు కువైట్‌ నుంచి జిల్లాకు వచ్చాడని తెలిపారు. అతడి రక్త నమూనాలను పూణెకు పంపనున్నారు. కాగా, కడపలోని బెల్లమండి వీధికి చెందిన ఓ మహిళ రెండు రోజుల క్రితం మక్కా నుంచి నగరానికి తిరిగి వచ్చింది. ఆమె జలుబు, దగ్గు, జ్వరంతో బాధ పడుతుండడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరో వ్యక్తికి కూడా ఆసుపత్రిలో చికిత్స అందుతోంది.
Corona Virus
Kadapa District

More Telugu News