Madhya Pradesh: మధ్యప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 26కు వాయిదా

madyapradesh sessions will be continue on 26th says speaker
  • విశ్వాసపరీక్షపై ఎటువంటి నిర్ణయం తీసుకోని స్పీకర్ 
  • బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాక వాయిదా నిర్ణయం 
  • అసెంబ్లీలో అధికార, విపక్ష సభ్యుల మధ్య గందరగోళం

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఈ నెల 26వ తేదీకి వాయిదా పడింది. ఈ రోజు ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ముగిసిన మరుక్షణం సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. వాస్తవానికి సంక్షోభంలో ఉన్న కమల్ నాథ్ సర్కారు విశ్వాసం నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశించారు. దీంతో ఈ రోజు విశ్వాస పరీక్ష జరుగుతుందనుకున్నా స్పీకర్ ఆ అంశాన్ని చేర్చలేదు.

ఈ నేపథ్యంలో గవర్నర్ ఉమ్మడి సభల సమావేశంలో కేవలం ఒక్క నిమిషమే మాట్లాడారు. ప్రజాప్రతినిధులు రాజ్యాంగ సంప్రదాయాలను, చట్టాలను పాటించాలని, ప్రజాస్వామ్య, శాసన సభ మర్యాదలను పాటించాలని సూచించి ప్రసంగం ముగించారు. తర్వాత స్పీకర్ వాయిదా నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలపై అధికార, విపక్ష సభ్యులు సభలో ఆందోళనకు దిగడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

Madhya Pradesh
assembly
postponed
kamalnadh

More Telugu News