Kanna Lakshminarayana: కేసీఆర్‌ అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. జగన్‌ మాత్రం పారాసిటిమల్ వేసుకోమంటున్నారు: కన్నా లక్ష్మీ నారాయణ విమర్శలు

  • కరోనాకు ప్రపంచం వణికిపోతోంది
  • చుట్టు పక్కల రాష్ట్రాలన్నీ బడులకు సెలవులు ఇచ్చారు
  • జగన్ కరోనా అనేది జబ్బే కాదంటున్నారు
kanna lakshminarayana about jagan comments

'కరోనా' పారాసిటిమల్ వేసుకుంటే తగ్గిపోయే జబ్బని ఏపీ సీఎం జగన్‌ వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... 'పక్క రాష్ట్రం తెలంగాణలో అధికారికంగా ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా అనేక జాగ్రత్తలు తీసుకోవడానికి ఆదేశాలిచ్చారు. దురదృష్టం ఏంటంటే.. మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మాత్రం కరోనా అనేది జబ్బు కాదు పారాసిటిమల్ వేసుకుంటే తగ్గిపోయే జబ్బని అంటున్నారు.. దాన్ని కారణంగా చూపించి ఎన్నికలు వాయిదా వేయడమేంటని అంటున్నారు' అని విమర్శించారు.

'కరోనాకు ప్రపంచం వణికిపోతోంది. చుట్టు పక్కల రాష్ట్రాలన్నీ బడులకు సెలవులు ఇచ్చారు.. అన్ని రాష్ట్రాలు జాగ్రత్తలు తీసుకుంటే కరోనా అనేది జబ్బే కాదని ప్రకటించిన సీఎం దేశంలో జగన్ ఒక్కరే. ఎన్నికలపై ఈసీ తీసుకున్న నిర్ణయాలను బీజేపీ స్వాగతిస్తోంది. ఈ రాష్ట్రంలో అప్రజాస్వామికంగా ఎన్నికలు జరుగుతున్నాయని మేము మొదటి నుంచీ చెబుతున్నాం. పోలీసుల మీద నమ్మకం పోయింది' అని తెలిపారు. 

More Telugu News