Whats App: వాట్సాప్ లో చేరనున్న మరో ఆసక్తికర ఫీచర్!

New Feature in Whats App
  • నిర్ణీత కాల పరిమితి తరువాత మెసేజ్ డిలీట్
  • సెట్టింగ్స్ ను ముందుగానే సెట్ చేసుకునే అవకాశం
  • తొలుత బీటా యూజర్లకు అందుబాటులోకి

సామాజిక మాధ్యమ దిగ్గజం వాట్సాప్ లో మరో ఆసక్తికర ఫీచర్ వచ్చి చేరనుంది. ఈమధ్య డార్క్ మోడ్ ను ప్రవేశపెట్టిన వాట్సాప్, త్వరలోనే సెల్ఫ్ డిస్ట్రక్షన్ మెసేజ్ సదుపాయాన్ని కస్టమర్లకు అందించనుంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే, యూజర్లు తాము పంపిన మెసేజ్ లను ఆటోమేటిక్ గా తొలగించే సదుపాయం దగ్గరవుతుంది.

 నిర్ణీతకాలంగా, ఓ గంటో, ఓ రోజో, వారమో, నెలో ముందుగానే ఎంచుకుంటే, ఆ మెసేజ్ లు సమయం ముగిసిన తరువాత డిలీట్ అవుతాయి. తొలి దశలో ఈ ఫీచర్ ను గ్రూప్ చాటింగ్ నకు మాత్రమే పరిమితం చేయాలని, ఆపై వ్యక్తిగత చాటింగ్ నకు కూడా వర్తింపజేయాలని వాట్సాప్ భావిస్తోంది. మిగతా అప్ డేటెడ్ ఫీచర్ల మాదిరిగానే ఇది కూడా తొలుత బీటా యూజర్లకు అందుబాటులోకి రానుంది.

  • Loading...

More Telugu News