Tirumala: లోక కల్యాణార్థం తిరుమలలో నేటి నుంచి యజ్ఞయాగాలు

  • కరోనా కట్టడి, మానవ శ్రేయస్సు కోసమే
  • 26 నుంచి మూడు రోజుల పాటు ధన్వంతరి మహాయాగం
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
  • మూడు కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
Yagnas from today in tirumala

కరోనా ప్రభావం తిరుమలగిరులపైనా స్పష్టంగా కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా రద్దీ గణనీయంగా తగ్గింది. ఈ ఉదయం స్వామి సర్వదర్శనం కోసం మూడు కంపార్టుమెంట్లలో భక్తులు వేచివుండగా, అన్ని రకాల దర్శనాలకూ రెండు నుంచి మూడు గంటల సమయం పడుతోందని అధికారులు వెల్లడించారు.

కాగా, రేపటి నుంచి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో భక్తులను కూర్చోబెట్టబోమని, ముందుగానే భక్తులకు సమయాన్ని కేటాయించి, టైమ్ స్లాట్ దర్శనాన్ని మాత్రమే అమలు చేయాలని టీటీడీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా, నిన్న స్వామిని  63,747 మంది దర్శించుకోగా, 22,485 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ. 2.51 కోట్ల ఆదాయం లభించింది.

కరోనా కట్టడి కావాలని కోరుతూ లోక కల్యాణార్థం ధన్వంతరి మహాయాగాలను నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. నేటి నుంచి 28 వరకూ ఈ యాగాలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా నేటి సాయంత్రం 4 గంటలకు 30 మంది వేద పండితులతో జపయజ్ఞం జరుగనుంది. ఆస్థాన మండపంలో 25న చతుర్వేద పారాయణం, తిరుమలలోని ధర్మగిరి వేద పాఠశాలలో ప్రత్యేక యాగం జరుగనున్నాయి. 26 నుంచి మూడు రోజుల పాటు శ్రీనివాస శాంత్యోత్స సహిత ధన్వంతరి మహాయాగం జరుగనుంది.

More Telugu News