Uttar Pradesh: రూ. 11కే కరోనాను తరిమేసే తాయెత్తు.. దొంగబాబా అరెస్ట్!

Fake baba arrested for selling Talisman for medicine to corona virus
  • యూపీలోని లక్నోలో ఘటన
  • బోర్డు పెట్టి మరీ విక్రయిస్తున్న దొంగ బాబా
  • ఎగబడి కొంటున్న ప్రజలు
కరోనా వైరస్‌ ఇప్పుడు దొంగ బాబాలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఒక్క తాయెత్తుతో కరోనా ఎగిరిపోతుందంటూ ప్రజలను నమ్మిస్తున్న దొంగబాబాకు పోలీసులు అరదండాలు వేశారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగిందీ ఘటన. చేతికి తాను కట్టే ఒకే ఒక్క తాయెత్తు కరోనాను పరుగులు పెట్టిస్తుందని నగరానికి చెందిన అహ్మద్ సిద్ధిఖీ ఏకంగా బోర్డు పెట్టి మరీ తాయెత్తులు విక్రయిస్తున్నాడు. అమాయక ప్రజలు నిజమేనని నమ్మి చేతికి తాయెత్తులు కట్టించుకుంటున్నారు. 11 రూపాయలేనన్న ధీమాతో ప్రజలు కూడా మాస్కులు మానేసి అటువైపే మొగ్గు చూపుతున్నారు. విషయం తెలిసిన పోలీసులు తాయెత్తు పేరుతో ప్రజలను మోసం చేస్తున్న సిద్ధిఖీని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.  
Uttar Pradesh
Lucknow
Corona Virus
Baba
Talisman

More Telugu News