Glenn Maxwell: భారత సంతతి అమ్మాయితో ఆసీస్ క్రికెటర్ నిశ్చితార్థం

Glenn Maxwell will tie the knot with Indian origin pharmacist
  • వినీ రామన్ తో గ్లెన్ మ్యాక్స్ వెల్ ఎంగేజ్ మెంట్
  • భారత సంప్రదాయ దుస్తుల్లో మ్యాక్స్ వెల్, వినీ
  • కొంతకాలంగా ప్రేమలో ఉన్న జోడీ
ఆస్ట్రేలియా జట్టులో హార్డ్ హిట్టర్ గా పేరుగాంచిన గ్లెన్ మ్యాక్స్ వెల్ భారత సంతతికి చెందిన వినీ రామన్ తో నిశ్చితార్థం చేసుకున్నాడు. త్వరలోనే వీరి పెళ్లి జరగనుంది. వినీ రామన్ మెల్బోర్న్ నగరంలో ఫార్మసిస్ట్ గా పనిచేస్తోంది. మ్యాక్స్ వెల్, వినీ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. ఇటీవలే తన ప్రేమ విషయాన్ని మ్యాక్స్ వెల్ అందరికీ వెల్లడించాడు. కాగా, ఎంగేజ్ మెంట్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. భారత సంప్రదాయ దుస్తుల్లో మ్యాక్స్ వెల్, వినీ చూడముచ్చటగా ఉన్నారు. దీనిపై వినీ రామన్ ఆసక్తికర ట్వీట్ చేసింది. పెళ్లి ఎలా జరగబోతోందో మ్యాక్స్ వెల్ కు ఈ చిన్న టీజర్ ద్వారా వెల్లడించాను అంటూ పేర్కొంది. వినీ చెబుతున్నదాన్ని బట్టి పెళ్లి కూడా పూర్తిగా భారతీయ సంప్రదాయాల ప్రకారం జరుగుతుందని అర్థమవుతోంది.
Glenn Maxwell
Vini Raman
Engagement
Australia
Melbourne

More Telugu News