Anushka Shetty: ప్రభాస్ తో అనుబంధంపై మరింత క్లారిటీ ఇచ్చిన అనుష్క

Anushka clarifies her friendship with Prabhas
  • తమది హిట్ పెయిర్ అని వెల్లడి
  • ప్రభాస్ పదేళ్లుగా తెలుసన్న అనుష్క
  • ప్రేమ ఉందంటూ వదంతులు ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యలు
టాలీవుడ్ లో ప్రభాస్, అనుష్కల స్నేహంపై వచ్చినన్ని ఊహాగానాలు, కథనాలు మరే జంట విషయంలోనూ రాలేదు. వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని, త్వరలోనే పెళ్లి అని బాహుబలి తర్వాత నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. ఈ ఇద్దరి వయసు పైబడుతున్నా ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉండడంతో పుకార్లకు మరింత బలం చేకూరుతోంది. అయితే వీరిద్దరూ ఎప్పటికప్పుడు తమపై వచ్చే ఊహాగానాలను కొట్టిపారేస్తుంటారు. తాజాగా, అనుష్క మరోసారి స్పష్టతనిచ్చారు. తామిద్దరూ ఇంకా సింగిల్ గా ఉన్నందునే పుకార్లు పుట్టిస్తున్నారని, తమ మధ్య ఉన్నది స్నేహం మాత్రమేనని స్పష్టం చేశారు.

అయితే, ప్రభాస్ కు తాను వేకువజామున మూడింటికైనా ఫోన్ చేయగలిగేంత చనువుందని వెల్లడించారు. వెండితెరపై తమ జోడీ సూపర్ హిట్ కావడంతో సహజంగానే ఊహాగానాలు వస్తుంటాయని, ప్రేమ అంటూ ఏవేవో ప్రచారం చేశారని పేర్కొన్నారు. ప్రభాస్ తనకు దశాబ్దకాలంగా తెలుసని, ప్రభాస్ వ్యక్తిత్వం కూడా తన వ్యక్తిత్వానికి దగ్గరగా ఉంటుందని, ఎలాంటి ఫీలింగ్ కలిగినా ఇతరులతో పంచుకుంటామని అనుష్క వివరించారు. కాగా, టాలీవుడ్ హిట్ పెయిర్లలో ప్రభాస్, అనుష్క ముందువరుసలో ఉంటారు. బిల్లా, మిర్చి, బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్ వరకు సక్సెస్ ఫుల్ జోడీగా పేరుతెచ్చుకున్నారు.
Anushka Shetty
Prabhas
Tollywood
Friendship
Rumors

More Telugu News