Allu Arjun: తన బిడ్డకు మంచి పునాది వేశారంటూ బోధి వ్యాలీ స్కూల్ టీచర్లకు బన్నీ కృతజ్ఞతలు

Allu Arjun thanked Bodhi Valley teachers for his son Ayan pre school completion
  • ప్రీస్కూల్ చదువు పూర్తిచేసుకున్న బన్నీ తనయుడు అయాన్
  • బోధి వ్యాలీ స్కూల్ లో ప్రీస్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుకలు
  • చిరస్మరణీయ జ్ఞాపకంగా భావిస్తాంటూ బన్నీ ట్వీట్
టాలీవుడ్ అగ్రహీరో అల్లు అర్జున్ తనయుడు అయాన్ ప్రీస్కూల్ పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ట్విట్టర్ లో స్పందించారు. "అయాన్ నువ్వు చక్కగా విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నందుకు ఎంతో గర్విస్తున్నాను. నా కొడుకు మంచి విద్యావంతుడు అయ్యేందుకు అవసరమైన పునాది వేయడంలో సహకరించిన బోధి వ్యాలీ స్కూల్ ఉపాధ్యాయవర్గానికి హృదయపూర్వక ధన్యవాదాలు. మా బిడ్డ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ కోసం బోధి వ్యాలీ స్కూల్ ను ఎంచుకున్నందుకు ఇప్పుడు తల్లిదండ్రులుగా మేమెంతో సంతోషిస్తున్నాం. ఇన్నేళ్లకాలంలో నా బ్డిడను సరైన రీతిలో నిలిపిన టీచర్లకు, సహాయక సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇవాళ్టి ప్రీస్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుకలను చిరస్మరణీయ జ్ఞాపకంగా భావిస్తాం" అంటూ బన్నీ భావోద్వేగాలు ప్రదర్శించారు.
Allu Arjun
Ayan
Pre School
Bodhi Valley School
Hyderabad

More Telugu News