Hyderabad: భార్య జీతం ఇమ్మంటే ఇవ్వడం లేదని... భర్త ఎంత నీచానికి దిగజారాడంటే!

  • సామాజిక మాధ్యమాల్లో ఆమెతోపాటు అత్త, మరదల ఫొటోలు 
  • అవసరమైతే సంప్రదించాలంటూ క్యాప్షన్లు 
  • పెళ్లికి ముందు షరతులకు అంగీకరించి ఆ తర్వాత నో

 ప్రేమ బాసలు చేశాడు. నువ్వే ప్రాణం అన్నాడు. 'నా ఇబ్బందులు ఇవి. పెళ్లయినా మా అమ్మకు, చెల్లెకి అండగా ఉం డాల్సిన అవసరం ఉంది. అందుకు ఒప్పుకుంటేనే' అని ఆమె కండిషన్ పెడితే 'నీకెలా నచ్చితే అలా చెయ్' అంటూ ఉత్తముడిలా నటించాడు. తీరా పెళ్లయ్యాకగాని అతని అసల రూపం బయటపడలేదు. పెళ్లి తర్వాత భార్య జీతం అడిగితే ఇవ్వడం లేదంటూ ఆమెతోపాటు అత్త, మరదల పై అసభ్యకర పోస్టింగ్ లు పెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్న ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి తీరిది.

సైబర్ క్రైం పోలీసుల కథనం మేరకు... హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయిన ఓ యువతి ఏడాదిన్నర క్రితం తన సహచరుడిని పెళ్లి చేసుకుంది. పెళ్లికి ముందే తన బాధ్యతల బరువు చెప్పి జీతంలో సగం తల్లి, చెల్లికి ఇస్తానని, అందుకు అంగీకరిస్తేనే పెళ్లని షరతు విధించింది. అందుకు అతను సరే అనడంతో పెళ్లి చేసుకుంది.

పెళ్లయిన రెండు నెలలకే భర్తకు బెంగళూరుకు బదిలీకాగా, ఆరునెలల తర్వాత ఆమెకు కూడా బదిలీ అయ్యింది. బెంగళూరులో కాపురం పెట్టాక అతని అసలు రూపం బయటపడడం మొదలయ్యింది. జీతం అంతా తనకే ఇవ్వాలని, లేదంటే పరువు తీస్తానంటూ బెదిరించేవాడు. ఆమె బెదిరింపులకు లొంగక పోవడంతో ఆమె వ్యక్తిత్వాన్ని కించరపరిచే పనులు చేయడం మొదలు పెట్టాడు.

భార్య, స్నేహితులతో పలు సందర్భాల్లో తీసుకున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పెడుతూ 'వీరంతా దేశముదుర్లు' అంటూ వ్యాఖ్యానించేవాడు. అలాగే, భార్య, అత్త, మరదలు ఫొటోలు పెట్టి 'సాయంత్రం మీకు బోరు కొడుతోందా...వీరిని సంప్రదించండి' అంటూ కింద రాసేవాడు. భార్య ఫేస్ బుక్ ఖాతాలోనూ కించపరిచే విధంగా వ్యాఖ్యాలు రాసేవాడు. ఇవన్నీ భరించలేని ఆమె చివరికి సైబర్ పోలీసులను ఆశ్రయించింది.

  • Loading...

More Telugu News