చిన్న చిన్న సంఘటనలను చూపి చంద్రబాబు లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారు: బొత్స

14-03-2020 Sat 19:56
  • పచ్చ నేతలకు లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్న బొత్స
  • రెచ్చగొట్టే వ్యాఖ్యలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ఆరోపణ
  • చంద్రబాబుకు పవన్ వత్తాసు అంటూ వ్యాఖ్యలు
Botsa reacts over Chandrababu comments

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వంపైనా, పోలీసులపైనా తీవ్ర వ్యాఖ్యలు చేయడంపై మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. చంద్రబాబు మామూలు సంఘటనలను చూపి లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

పచ్చ నేతలకు లోకమంతా పచ్చగా కనిపించడంలో ఆశ్చర్యమేమీ లేదని వ్యాఖ్యానించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని బొత్స ఆరోపించారు. చంద్రబాబుకు పవన్ కల్యాణ్ కూడా వత్తాసు పలుకుతున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో కల్లోలం సృష్టించేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.