కివీస్ క్రికెటర్ కు ఊరట... కరోనా లేదని రిపోర్టులో వెల్లడి!
- గొంతునొప్పిగా ఉందన్న న్యూజిలాండ్ పేసర్ ఫెర్గుసన్
- కరోనా వైద్య పరీక్షలు నిర్వహించిన జట్టు యాజమాన్యం
- సిడ్నీ హోటల్లో ఐసోలేషన్
- కరోనా నెగెటివ్ అని రావడంతో రేపు స్వదేశానికి వెళ్లనున్న ఫెర్గుసన్
ఇప్పుడా పరీక్షల తాలూకు రిపోర్టు రాగా, అందులో ఫెర్గుసన్ కు కరోనా లేదని వెల్లడైంది. దాంతో ఈ క్రికెటర్ ను స్వదేశం వెళ్లేందుకు అనుమతించారు. గొంతు నొప్పి అనడంతో ఫెర్గుసన్ ను సిడ్నీలోని హోటల్లోనే విడిగా ఓ గదిలో ఉంచారు. ఇప్పుడతను న్యూజిలాండ్ వెళ్లేందుకు అడ్డంకి తొలగిపోయింది. లాకీ ఫెర్గుసన్ రేపు న్యూజిలాండ్ చేరుకుంటాడని ఆ దేశ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో వెల్లడించింది.