Lockie Ferguson: న్యూజిలాండ్ క్రికెటర్ కు కరోనా పరీక్షలు... ఐసోలేషన్ కు తరలింపు

New Zealand cricketer being isolated after suffered sore throat
  • కరోనా కారణంగా ఆసీస్ పర్యటన నుంచి తప్పుకున్న న్యూజిలాండ్
  • సిడ్నీ వన్డే తర్వాత గొంతు నొప్పితో బాధపడిన కివీస్ పేసర్
  • అతడిని జట్టు నుంచి విడిగా ఉంచిన యాజమాన్యం
కరోనా భయంతో ఆస్ట్రేలియా పర్యటన నుంచి న్యూజిలాండ్ జట్టు విరమించుకున్న సంగతి తెలిసిందే. అయితే తొలి వన్డే ముగిసిన తర్వాత న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గుసన్ కు గొంతు నొప్పిగా ఉండడంతో అతడికి కరోనా వైద్యపరీక్షలు నిర్వహించారు. ముందు జాగ్రత్త చర్యగా జట్టులోని ఇతర సభ్యుల నుంచి అతడిని విడిగా ఉంచారు. సిడ్నీలో నిన్న మ్యాచ్ ముగిసిన వెంటనే లాకీ ఫెర్గుసన్ కు వైద్యపరీక్షలు నిర్వహించి, జట్టు బస చేసిన హోటల్లోనే ప్రత్యేక గదికి తరలించారు. వైద్యపరీక్షల నివేదిక వచ్చిన తర్వాతనే అతడు జట్టుతో కలిసేదీ, లేనిదీ నిర్ణయిస్తారు.
Lockie Ferguson
Corona Virus
Team New Zealand
Australia
ODI
Sydney

More Telugu News