RSS: వార్షిక సమావేశాలను రద్దు చేసుకున్న ఆరెస్సెస్

RSS calls off annual meeting in Bengaluru amid Corona virus outbreak
  • రేపటి నుంచి మూడు రోజుల పాటు జరగాల్సిన సమావేశాలు
  • హాజరు కావాల్సిన 1500 మంది ప్రతినిధులు
  • కరోనా వైరస్ నేపథ్యంలో సమావేశాలు రద్దు
బెంగళూరులో జరగాల్సిన వార్షిక సమావేశాలను (అఖిల భారతీయ ప్రతినిధి సభ సమావేశాలు) ఆరెస్సెస్ రద్దు చేసుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి జరగాల్సిన సమావేశాలను రద్దు చేసినట్టు ఆరెస్సెస్ జనరల్ సెక్రటరీ భయ్యా జోషి తెలిపారు. బెంగళూరులోని జనసేవ విద్యా కేంద్రంలో రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరగాల్సి ఉంది. ఈ సమావేశాలకు ఆరెస్సెస్, దాని అనుబంధ విభాగాలకు చెందిన దాదాపు 1500 మంది ప్రతినిధులు హాజరుకావాల్సి ఉంది. మరోవైపు, కరోనా నేపథ్యంలో బెంగళూరు హైఅలర్ట్ లో ఉంది. పలు షాపింగ్ మాల్స్ కూడా మూతపడ్డాయి.
RSS
Annual Meet
Cancel
Bengaluru

More Telugu News