actress sheela: వ్యాపారవేత్తను పెళ్లాడిన ’పరుగు’ హీరోయిన్ షీలా కౌర్

Parugu actress Sheela Kaur ties the knot with a businessman
  • పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న నటి
  • చెన్నైలో కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వివాహ వేడుక 
  • ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన షీలా
పరుగు, అదుర్స్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ హీరోయిన్ షీలా కౌర్ పెళ్లి పీటలెక్కింది. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె.. చెన్నైకి చెందిన సంతోష్ రెడ్డి అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. చెన్నైలో బుధవారం జరిగిన ఈ వివాహ వేడుకకు అతి తక్కువ మందిని ఆహ్వానించారు. పెద్దలు కుదిర్చిన ఈ పెళ్లికి వధూవరులు కుటుంబ సభ్యులు,స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. తన పెళ్లి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులకు షీలా తెలియచేసింది. పెళ్లి ఫొటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.

 బాలనటిగా తమిళ చిత్ర పరిశ్రమలో డజనుకు పైగా సినిమాల్లో నటించిన షీలా 2006లో నవదీప్ హీరోగా నటించిన ‘సీతాకోకచిలుక’ అనే చిత్రంతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత రాజు భాయ్, మస్కా, అదుర్స్‌, పరుగు చిత్రాల్లో నటించింది. అల్లు అర్జున్‌కు జోడీగా నటించిన పరుగు సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చింది.
actress sheela
ties knot
chennai
Tollywood

More Telugu News