Donald Trump: ఇండియా, మోదీలపై ప్రేమాభిమానాలను కురిపించిన ట్రంప్

Loved Being With PM Modi says Donald Trump
  • భారత పర్యటనను ఎంతగానో ఆస్వాదించా
  • మోదీతో సమయాన్ని గడపడం ఎంతో సంతోషాన్నిచ్చింది
  • మోదీ నాకు మంచి మిత్రుడు
భారత్ పర్యటనను తాను ఎంతగానో ఆస్వాదించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ప్రధాని మోదీతో సమయాన్ని గడపడం ఎంతో సంతోషాన్నిచ్చిందని చెప్పారు. ఇండియాలో గడిపిన రెండు రోజులు మర్చిపోలేనివని అన్నారు.

 మోదీ తనకు మంచి మిత్రుడని చెప్పారు. ఆయన ప్రజలందరికీ మిత్రుడేనని కితాబిచ్చారు. భారత పర్యటన సందర్భంగా మోదీ, తాను అన్ని విషయాలపై చర్చించామని... సరిహద్దులను దాటి తమ చర్చలు జరిగాయని తెలిపారు. ఫిబ్రవరి 24న భార్య మెలానియా ట్రంప్, కుమార్తె ఇవాంకా ట్రంప్, అల్లుడు కుష్నర్ లతో కలసి డొనాల్డ్ ట్రంప్ ఇండియాకు వచ్చిన సంగతి తెలిసిందే.
Donald Trump
USA
Narendra Modi
India Tour

More Telugu News