Robots: కరోనాపై పోరాటానికి రోబోలను రంగంలోకి దింపిన కేరళ

  • కేరళ స్టార్టప్ మిషన్ వినూత్న నిర్ణయం
  • ప్రయోగాత్మకంగా కొచ్చిలో రెండు రోబోల వినియోగం
  • ప్రజలకు మాస్కులు, శానిటైజర్లు, నాప్ కిన్స్ అందిస్తున్న ఒక రోబో
  • కరోనాపై ప్రచారం చేస్తున్న మరో రోబో
Kerala fields two robots to battle corona

భారత్ లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో క్రమంగా జనజీవనం కుంటుపడే సూచనలు కనిపిస్తున్నాయి. కేరళలో కరోనా ప్రభావం దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనాపై పోరాటానికి కేరళ స్టార్టప్ మిషన్ కొచ్చిలో ప్రయోగాత్మకంగా రోబోలను వినియోగిస్తోంది. ఇప్పటివరకు రెండు రోబోలను రంగంలోకి దింపారు. ఈ రోబోలను అసిమోవ్ రోబోటిక్స్ సంస్థ రూపొందించింది. ఈ రోబోల్లో ఒకటి ప్రజలకు మాస్కులు, శానిటైజర్లు, నాప్ కిన్స్ పంపిణీ చేస్తుంది. మరో రోబో స్క్రీన్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసే కరోనా ప్రకటనలను, సమాచారాన్ని ప్రదర్శిస్తుంది. రోబోల వినియోగంతో ప్రజల్లో భారీ ఎత్తున స్పందన వస్తోందని కేరళ స్టార్టప్ మిషన్ వర్గాలు తెలిపాయి. ఈ వినూత్న ప్రయోగం సత్ఫలితాలను ఇవ్వడంతో ఎయిర్ పోర్టుల వంటి బహిరంగ ప్రదేశాల్లో మరిన్ని రోబోలను వినియోగించాలని స్టార్టప్ మిషన్ భావిస్తోంది.

More Telugu News