Polavaram Project: పోలవరం భూసేకరణ వ్యయాన్ని భరించేందుకు కేంద్రం అంగీకారం

  • పోలవరం సవరించిన అంచనా వ్యయం రూ.55,545 కోట్లు
  • రూ.48 వేల కోట్ల వ్యయానికి కేంద్రం ఆమోదం
  • ఇప్పటికే పోలవరంకు రూ.16 వేల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం
Centre gives assurance to bear Polavaram revised estimations

ఏపీలో అతిపెద్ద ప్రాజెక్టుగా పేరుగాంచిన పోలవరంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పోలవరం భూసేకరణ వ్యయాన్ని భరించేందుకు పచ్చ జెండా ఊపింది. పోలవరం సవరించిన అంచనా వ్యయం రూ.55,545 కోట్లు కాగా, రూ.48 వేల కోట్ల వ్యయానికి కేంద్ర ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. పోలవరంపై కేంద్రం ఇప్పటికే రూ.16 వేల కోట్లు ఖర్చు చేసింది. మిగతా రూ.32 వేల కోట్లను కూడా భరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. కేంద్రం తాజా నిర్ణయంతో పోలవరం భూసేకరణ, పునరావాసంపై స్పష్టత వచ్చినట్టయింది.

More Telugu News