Kanna Lakshminarayana: పోలీసులే వైసీపీ నేతల్లా, కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు: కన్నా

Kanna slams AP police that they were being act as YSRCP members
  • విజయనగరంలో బీజేపీ కార్యాలయం పునఃప్రారంభం
  • ఎన్నికలు సజావుగా సాగే పరిస్థితులు కనిపించడంలేదన్న కన్నా
  • ఈసీ ప్రేక్షక పాత్ర పోషిస్తోందని విమర్శలు
విజయనగరంలో బీజేపీ కార్యాలయాన్ని ఆధునికీకరించిన అనంతరం పునఃప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ, రాష్ట్రంలో పోలీసులే వైసీపీ నేతల్లా, కార్యకర్తల్లా వ్యవహరిస్తూ దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సక్రమంగా జరుగుతాయన్న నమ్మకం కలగడంలేదని, జరుగుతున్న పరిణామాలపై ఈసీ స్పందించడంలేదని విమర్శించారు. రాష్ట్రంలో అరాచకత్వం రాజ్యమేలుతోందని, కేంద్రం, ఈసీ జోక్యం చేసుకోక తప్పదని అన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో కన్నాతో పాటు ఎమ్మెల్సీ మాధవ్, విజయనగరం జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రెడ్డి పావని కూడా పాల్గొన్నారు.
Kanna Lakshminarayana
YSRCP
Police
Local Body Polls
Vijayanagaram
BJP
Office

More Telugu News