Dr Subhash: అనుమానాస్పద స్థితిలో మరణించిన యశోదా ఆసుపత్రి కార్డియాలజిస్టు

Yashoda hospital cardiologist died
  • 2017లో డాక్టర్ లాస్యతో సుభాష్ వివాహం
  • భార్యతో విభేదాల కారణంగా ఒంటరిగా ఉంటున్న వైనం 
  • జ్వరంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందిన సుభాష్
హైదరాబాదులోని యశోదా ఆసుపత్రిలో కార్డియాలజిస్టుగా పనిచేస్తున్న డాక్టర్ సుభాష్ అనుమానాస్పద స్థితిలో మరణించడం కలకలం రేపింది. 32 ఏళ్ల సుభాష్ స్వస్థలం మంచిర్యాల జిల్లా తంగూర్ గ్రామం. జ్వరం కారణంగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందిన సుభాష్ నేడు తన ఫ్లాట్ లో మృతి చెందిన స్థితిలో కనిపించాడు.

 సుభాష్ భార్యతో విభేదాల కారణంగా ఒంటరిగా ఉంటున్నట్టు గుర్తించారు. నేరేడ్ మెట్ కు చెందిన డాక్టర్ లాస్యతో సుభాష్ వివాహం 2017లో ఆర్యసమాజ్ లో జరిగింది. కొన్నాళ్ల పాటు వీరు గాయత్రీనగర్ లోని పద్మావతి అపార్ట్ మెంట్స్ లో నివాసం ఉన్నారు. కొంతకాలంగా ఇద్దరి మధ్య కలతలు రావడంతో ఎవరికి వారుగా ఉంటున్నారు. సుభాష్ మృతికి కుటుంబ పరమైన కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Dr Subhash
Death
Yashoda Hospitals
Hyderabad

More Telugu News