Kane Richardson: ఆసీస్ ఫాస్ట్ బౌలర్ కేన్ రిచర్డ్సన్ కు కరోనా లేదట!

Aussies pacer Kane Richardson tested corona negative
  • గొంతు నొప్పితో బాధపడుతున్న కేన్ రిచర్డ్సన్
  • వైద్యపరీక్షలు చేయించిన జట్టు యాజమాన్యం
  • మ్యాచ్ లో ఆడేందుకు తొలగిన అడ్డంకి  
ఇటీవలే దక్షిణాఫ్రికా టూర్ నుంచి వచ్చిన ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ కేన్ రిచర్డ్సన్ కు కరోనా పరీక్షలు చేయడం క్రికెట్ వర్గాల్లో కలకలం రేపింది. న్యూజిలాండ్ తో తొలి వన్డే నేపథ్యంలో గొంతు నొప్పితో బాధపడుతున్న కేన్ రిచర్డ్సన్ కు కరోనా అనుమానంతో వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ వైద్యపరీక్షల్లో అతడికి కరోనా సోకలేదని తేలింది.

దాంతో ఆస్ట్రేలియా క్రికెట్ వర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి. రిచర్డ్సన్ సాధారణ గొంతునొప్పితోనే బాధపడుతున్నాడని, అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వ నూతన మార్గదర్శకాలను అనుసరించి వెంటనే కరోనా పరీక్షలు చేయించామని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. దాంతో న్యూజిలాండ్ తో మ్యాచ్ లో ఆడేందుకు రిచర్డ్సన్ కు అడ్డంకి తొలగినట్టయింది.
Kane Richardson
Corona Virus
Australia
New Zealand
South Africa

More Telugu News