ఐపీఎల్ సహా అన్ని ఆటలపై నిషేధం విధించిన ఢిల్లీ ప్రభుత్వం

No IPL and Other Sports Event In Delhi Amid Virus Threat says Manish Sisodia
  • కరోనా నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం
  • 200 మందికి మించి హాజరయ్యే అన్ని ఆటల నిర్వహణపై నిషేధం
  • ఇప్పటికే మూతపడ్డ విద్యాలయాలు, సినిమా థియేటర్లు
ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా త్వరలోనే ప్రారంభం కానున్న ఐపీఎల్ సహా అన్ని ఆటలపై నిషేధం విధించింది. కరోనా విస్తరించకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తెలిపారు. 200 అంతకు మించి ప్రేక్షకులు హాజరయ్యే ఏ స్పోర్ట్స్ ఈవెంట్ ను కూడా అనుమతించబోమని స్పష్టం చేశారు. మరోవైపు, మార్చ్ 31 వరకు విద్యాలయాలు, సినిమా థియేటర్లను మూసివేయాలంటూ ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది.
Go Back to Shorts
IPL
Ban
Delhi
Manish Sisodia

More Telugu News